ప్రజాశక్తి – బాపట్ల జిల్లా : సోమవారం సిపిఎం పార్టీ బఅందం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రర్ జైన్ కి వినతి పత్రం ఇచ్చారు.,జె సీ వెంటనే జిల్లా వ్యవసాయ శాఖ జెడి రామకృష్ణ కి చెప్పి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య మాట్లాడుతూ … జిల్లాలో అద్దంకి , పర్చురు నియోజకవర్గం లో సుమారు 30 వేల ఎకరాల్లో నల్లబర్లి పొగాకు వేయటం జరిగినది, ఎకరానికి 1,50,000 వరకు పెట్టుబడి అయినది, ప్రవేట్ కంపెనీ వాళ్ళు మంచి ధర ఇస్తామని ప్రోత్సహించినారు, ఈరోజు ఎక్కడ కూడా పొగాకు కొనుగోలు చేయని పరిస్థితిలో రైతులు ఆందోళనలో ఉన్నారు, మధ్య దళారులు క్వింటాకు నాలుగైదు వేల రూపాయలు కన్నా ఎక్కువ కొనే పరిస్థితి లేదు, జిల్లా అధికారులు ,జిల్లాలో ఉన్న మంత్రులు ముఖ్యంగా అద్దంకి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు చొరవ చూపి కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి అద్దంకి, పర్సురు నియోజకవర్గాల్లో నల్ల బర్లి పొగాకు వేసిన రైతులను ఆదుకోవాలని కోరారు. లేనిపక్షంలో రైతులను కూడగట్టి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి కృష్ణమోహన్, జిల్లా కమిటీ సభ్యులు పి కొండయ్య పాల్గొన్నారు.
బాపట్లలో రైతుల నల్లబర్లి పొగాకు కొనుగోలుకు చర్యలు తీసుకోవాలి : సిపిఎం బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య
