ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 30 ప్రకారం పట్టణా ల్లో నివాసం ఉంటున్న ఇళ్లుకి 2 సెంట్లు ఉచితంగా రెగ్యులర్ చేసి ఇవ్వాలని సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు పరిష్కారం కోసం సిపిఎం చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర సందర్భంగా మంగళవారం 29 వ డివిజన్ రామకృష్ణా నగర్, దాసన్న పేట ల్లో జరిగిన సభల్లో ఆయన మాట్లాడుతూ పేదలకు తెచ్చిన జీఓ పెద్దల ఉపయోగించుకోకుండా చూడాలని ఆయన కోరారు. పేదలు నివసించే ప్రాంతాల్లో పక్కగా రెగ్యులర్ చేసి న్యాయం చేయాలని కోరారు. గతంలో 116 జీ ఓ లాగే దీన్ని నీరుగార్చకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. విజయనగరం లో రామకఅష్ణానగర్ తో పాటు ఉన్న అనేక కాల నీళలో ఈ ఇళ్ల రెగ్యులర్ సమస్యలు ఉన్నాయని వాటినన్నిటినీ పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం. జగధాంబ, కె .రమణమ్మలు పాల్గొన్నారు.
గంజి పేటలో…
గంజిపేట లో 50 ఏళ్లు గా నివాసం ఉంటున్న పేదలకు, దళితుల ఇళ్లు రెగ్యులర్ చేయాలని, కుళాయి కనెక్షన్లు మంజూరు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి. రమణమ్మ కోరారు. గోడగల వీధిలో గిరిజన పేదలు కి నివాసం ఉంటున్న చోట రెగ్యులర్ చేయాలని సిపిఎం నగర కమిటీ సభ్యులు బి. రమణ కోరారు.