విద్యుత్‌ కుంభకోణాన్ని బయట పెట్టాలి : సీపీఎం డిమాండ్‌

Nov 30,2024 15:13 #CPM demands, #electricity scam

ప్రజాశక్తి-బొబ్బిలి (విజయనగరం) : విద్యుత్‌ కుంభకోణాన్ని బయట పెట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.శంకరరావు, మండల కన్వీనర్‌ ఎస్‌.గోపాలం డిమాండ్‌ చేశారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఆదాని అవినీతిపై అమెరికాలో కేసు నమోదు అయితే అవినీతి జరిగిన ఇండియా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కేసులు నమోదు చేయకపోవడం దుర్మార్గమన్నారు. గత వైసీపీ హయాంలో ఆదాని గ్రూపు సంస్థలు ఉత్పత్తి చేసిన సౌర విద్యుత్‌ కొనుగోలు చేయడానికి అప్పటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులు అందినట్లు ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. వైసీపీ హయాంలో రూ ఎం2,029 కోట్లు ముడుపులు అందగా ప్రభుత్వ పెద్దకు రూ.1,757 కోట్లు ముట్టినట్లు అమెరికాలో కేసు నమోదు అయిందని చెప్పారు. విద్యుత్‌ ముడుపులు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకి బ్రోకరిజం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. యువిన్‌ విద్యుత్‌ రూ.1.99పైసలకు కొనుగోలు చేయాల్సి ఉండగా రూ ఎం2.49పైసలకు కొనుగోలు చేయడంతో రాష్ట్ర ప్రజలపై రూ.9,412 కోట్లు భారం పడుతుందని విమర్శించారు. పాలకుల అవినీతితో ప్రతినెల విద్యుత్‌ చార్జీలు పెరిగి ప్రజలపై భారాలు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ కుంభకోణాన్ని టీడీపీ ప్రభుత్వం బయట పెట్టాలని, విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసి విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. లేనిచో అన్ని పార్టీలు, సంఘాలను కలుపుకుని పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు యుగంధర్‌, ప్రసాద్‌ ఉన్నారు.

➡️