ఉచిత ఇసుక అమలు చేయాలని సిపిఎం ధర్నా

Nov 14,2024 17:47 #Palakollu, #prajaporu

ప్రజాశక్తి – పాలకొల్లు : ఉచిత ఇసుక పాలసీ అమలు చేసి కార్మికుల కు ఉపాధి కల్పించాలని మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్ డిమాండ్ చేశారు. గురువారం పాలకొల్లు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చిందన్నారు. ఇప్పుడు పథకాలు అమలుకు ఖజానా ఖాళీ అంటున్నారని విమర్శించారు. సూపర్ 6 హామీలు ఎప్పుడు అమలుచేస్తారో చెప్పాలని ప్రజలు ఎదురు చూస్తున్నరని అన్నారు. ఎన్నికల ముందు కరెంటు ఛార్జ్ లు పెంచమని చెప్పారని ఇప్పుడు ట్రూ అప్ ఛార్జ్ ల పేరుతో వేల కోట్ల రూపాయలు భారం ప్రజలపై వేయడానికి సిద్ద పడుతున్నారని విమర్శించారు. స్మార్ట్ మీటర్ లు ప్రమాదమని బిగింపు ను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ధరలు అదుపు కు చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్నదని విమర్శించారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ, కరపత్రాలు పంచుతూ ప్రజాపోరు కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలుకు తీసుకు రావాలని లేకుంటే సి.పి.ఎం పార్టీగా ప్రజలను కదిలించి పోరాటాలు చేస్తామని రాజగోపాల్ హెచ్చరించారు. ఈకార్యక్రమంలో కార్యదర్శి జవ్వాది శ్రీనివాస్ మాట్లాడారు. ఇంకా టి.గంగరాజు, చల్లా సోమేశ్వరరావు, వై.అజయ్, టి.శ్రీనివాసరావు, వెంకన్న, నగేష్, శ్రీనివాసురెడ్డి, యాకల రాము తదితరులు పాల్గొన్నారు.

➡️