అదానీని అరెస్టు చేయాలి : సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు

హైరోడ్డు సర్కిల్‌ (చిత్తూరు) : సెకీ నుండి రాష్ట్ర డిస్కాములు విద్యుత్‌ ఒప్పందాలు చేసుకునేందుకు అదానీ గ్రూపు భారీ ముడుపులు చెల్లించిన నేపథ్యంలో రాష్ట్రంలో అదానీ గ్రూపు కంపెనీ చేసుకున్న విద్యుత్‌ ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని,ఆదానీని వెంటనే అరెస్టు చేయాలని శనివారం చిత్తూరు హైరోడ్డు సర్కిల్‌ నందు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నానుద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ 2019-20 మధ్య సెకి ఒప్పందమే గాక రాష్ట్రంలో పంప్డ్‌ స్టోరేజి విద్యుత్‌ ప్లాంట్లు, విశాఖలో డేటా సెంటర్‌, గంగవరం పోర్టు వంటి వివిధ ప్రాజెక్టులను అదానీ గ్రూపు సంస్థలతో నాటి ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుని ప్రభుత్వ ఆస్తులను, ప్రజల సంపదను వారికి ధారాదత్తం చేసిందని విమర్శించారు.అదానీ గ్రూపు అక్రమాలను ప్రతి ఒక్కరు ఖండించాలని పిలుపునిచ్చారు.. ఈ నిరసన ప్రదర్శనల్లో ప్రజలు పాల్గని జయప్రదం చేయాల్సిందిగా కోరారు. అదానీ గ్రూపుతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేసుకోవాలని డిమాండ్‌ చేశారు.వారికి కేటాయించిన భూముల్ని, ప్రజల సంపదను వెనక్కి తీసుకోవాలన్నారు.విశాఖ డేటా సెంటర్‌ను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలి. లంచాలు తీసుకున్న అవినీతిపరుల పేర్లు, వివరాలను అమెరికా ప్రభుత్వం నుండి పొందడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా దౌత్యపరమైన చర్యలు వెంటనే చేపట్టాలి. అమెరికా న్యాయ స్థానాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా అదానిపై కేసు నమోదు చేయాలి. వెంటనే కేసు నమోదు చేసేటట్లు సిబిఐని ఆదేశించాలి. గౌతమ్‌ అదానీని, ఇతర నిందితులను వెంటనే అరెస్టు చేయాలి.అదానీ గ్రూపు అక్రమాలను వెలికితీసేందుకు స్వతంత్ర సంస్థతో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం మొదటి నుంచి దేశంలో ఉన్న కార్పొరేట్‌ సంస్థ ఆదానే తన వ్యతిరేకిస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడం దారుణం అన్నారు ఇప్పుడు సిపిఎం మీద చెప్పిందో అదే జరిగింది. దేశ సంపదను అప్పనంగా కేంద్ర ప్రభుత్వం ఆదానిలకు అప్పగిస్తున్నది ప్రజలపై ద్వారాలు మోపుతూ కార్పోటు శక్తులకు రైతులు ఇస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ప్రజలు ఎండగట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు సురేంద్రన్‌, గిరిధర్‌ గుప్తా, నాయకులు మురళి, ఈశ్వరయ్య, దాసు, ఆనంద్‌, బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

➡️