యానాదులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి : సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు

బంగారుపాళ్యెం (చిత్తూరు) : బంగారుపాళ్యెం మండలం మొగిలి యానాదుల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ మొగిలి యానాదుల స్మశానం ఆక్రమించారని మూడు నెలల క్రితం కలెక్టర్‌ కి ఫిర్యాదు చేయగా కలెక్టర్‌ మొత్తం సర్వే చేయించి మొగిలి ఊర గుట్ట 59 ఎకరాలు ప్రభుత్వ స్థలము ఉందని తేల్చారు. ఈ స్థలంలో 12 మంది ఆక్రమ దారులు ఉన్నారని రెవెన్యూ అధికారులు ప్రకటించారు. రెవెన్యూ అధికారులు మొగిలి యానాధలకు స్మశానం 60 సెంట్లు కేటాయించి, స్కెచ్‌ ఇచ్చి హద్దులు చూపినా స్మశానంలో అగ్రకులస్తులు బోరు వేసి ఆక్రమించారు. రెవెన్యూ అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యం చేయడం సరైంది కాదని తెలిపారు. యానాదులకు మూడు సెంట్లు ఇంటి స్థలం పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. అక్రమ దారులు పట్టాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మిగిలిన స్థలంలో ప్రజా ప్రయోజనాల కోసం యానాదులకు స్కూలు, హాస్టల్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. స్మశానం లో ఆక్రమణలు తొలగించి పెన్షింగ్‌ వేయాలని డిమాండ్‌ చేశారు. బంగారు పాల్యం రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి ఖండించారు. ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో పోరాటాన్ని దశలవారీగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం నాయకులు బంగారు మురళి, మొగిలి యానాధల సంఘం కమిటీ అధ్యక్షురాలు నిర్మల తో పాటు యానాదులు పాల్గొన్నారు.

➡️