ప్రజాశక్తి-నంద్యాల కలెక్టరేట్ : వార్డుల్లో సమస్యలు తిష్ట వేస్తున్నాయి.. మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు… వారానికి ఒక్కసారి మురికి కాల్వలు శుభ్రం చేస్తున్నారు.. మరి కొన్ని వార్డులకు కాల్వలు శుభ్రం చేసే వాళ్లు రావడం లేదు.. చెత్త చెదారంతో కాల్వలు నిండిపోతున్నాయి.. రోడ్ల పైననే చెత్త కుప్పలు ఉంటున్నాయని వార్డుల్లో ప్రజలు చెప్పుతుండగా బీడీ కార్మికుల పరిస్థితి వర్ణనాతీతం.పొద్దాస్తమానం బీడీలు తయారు చేసిన రోజుకు నూట డెబ్భై రూపాయలు కూలీ పడటం లేదు.. మా జీవితాలు దుర్భరంగా ఉన్నాయి మా గురించి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అర్దాకలితో జీవిస్తున్నాం.. సిపిఎం నాయకుల వార్డుల పర్యటనల్లో ప్రజల మనోగతం.. గత రెండు రోజులుగా సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రల పేరుతో వార్డుల పర్యటన చేపట్టారు. అందులో భాగంగా శుక్రవారం గాంధీ చౌక్ నుండి ప్రారంభమైన ప్రజా చైతన్య యాత్ర వన్ టౌన్ మీదుగా నడిగడ్డ, నబీ నగర్, జగజ్జననీ నగర్, ఆత్మకూర్ బస్టాండ్ ఏరియా, ఫరూక్ నగర్ ఉప్పరి పేట తదితర వార్డులలో సిపిఎం నాయకులు పర్యటించారు.రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు యించిన హామీలు, సూపర్ సిక్స్ పథకాల అమలు గురించి, స్థానిక సమస్యలను సిపిఎం పట్టణ కార్యదర్శి దర్శనం లక్ష్మణ్, కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లా నరసింహ, సీనియర్ నాయకులు తోట మద్దులు, రామరాజు, తదితర నాయకులు పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ వార్డులలో రెగ్యులర్ గా నీళ్లు వస్తున్నప్పటికి వారానికి ఒక్కసారి మురికి కాల్వలు శుభ్రం చేస్తున్నారని, రెగ్యులర్ గా కాల్వలను శుభ్రం చేయడం లేదని, కనీసం పాగింగ్ చేయడం లేదని ప్రజలు సిపిఎం నాయకుల దఅష్టికి తెచ్చారు.దోమల బెడదా ఉందని,కరెంట్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని,రూ. 500 రూ.600 వచ్చే కరెంటు బిల్లు రూ.1500 నుండి రెండు వేల వరకు వస్తున్నాయని కరెంటు చార్జీలు కట్టలేక పోతున్నామని వార్డ్ లోని 80 శాతం మంది ప్రజలు సిపిఎం నాయకుల ముందు తమ ఆవేదనను వెళ్లబుచ్చారు.రేషన్ సరఫరాలో కేవలం బియ్యం, చెక్కర మాత్రమే ఇస్తున్నారని కందిపప్పు,జన్నలు ఇవ్వడంలేదని ప్రజలు నాయకులకు వివరించారు.ఆరుకాలం బీడీలు చూడుతున్న తమ జీవితాల్లో వెలుగులు రావడం లేదని బీడీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజంత పని చేసిన 170 రూపాయలు వస్తుందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని బీడీ కార్మికులు కోరుతున్నారు. అనంతరం సిపిఎం పట్టణ కార్యదర్శి దర్శనం లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లా నరసింహ, సీనియర్ నాయకులు తోట మద్దులు మాట్లాడుతూ ప్రజలు స్థానికంగా వార్డులలో దోమల సమస్యలతో అల్లాడుతున్నారని, మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వలన మురికి కాల్వల్లో చెత్తా చెదారం పేరుకపోతుందని కాల్వలలో మురికి నీరు నిల్వ ఉండటం వలన చుట్టుప్రక్కల ఇళ్లకు దుర్వాసన రావడం, దోమల వఅద్ధి పెరిగిపోతుందన్నారు. ఫలితంగా వార్డుల్లో ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. వీటికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పైన విద్యుత్ భారలు మోపుతుందని, ప్రతి ఇంటికి సగటున నెలకు 200 నుండి 300 రూపాయలు విద్యుత్ వినియోగదారులపై భారం పడిందని వారు పేర్కొన్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని వారు విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు పేరు చెప్పి వాటిని జిల్లాకు మాత్రమే పరిమితం చేయడం విచారకరమన్నారు. ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, వార్డుల్లో ప్రజల సమస్యలను పరిష్కరించి, రెగ్యులర్ గా డ్రైనేజీ కాల్వల ను శుభ్రం చేయాలని వారు డిమాండ్ చేశారు.
