స్థానిక సమస్యలపై మంత్రి సవితమ్మకి సిపిఎం నాయకులు వినతి

Oct 7,2024 15:50 #anatapuram

ప్రజాశక్తి -పెనుకొండ టౌన్ : పట్టణంలో అద్వాన్నంగా మారిన రోడ్లు, డ్రైనేజీలను బాగుచేయాలని సిపిఎం నాయకులు హరి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలోని భువన విజయం సమావేశం భవనంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకులు హరి, నాయకులు బాబావలి రాష్ట్ర మంత్రి సవితమ్మకి పట్టణంలోని రోడ్లు, డ్రైనేజీ సమస్యల పై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా సిపిఎం నాయకులు హరి మాట్లాడుతూ పట్టణంలోని వార్డులలో ఎక్కడ చూసిన అద్వానంగా రోడ్లు ఉంటూ, వాహన దారులకు, పాదాచారులకు, అనేక సమస్యలు ఉత్పన్న మవుతున్నాయి అని, చిన్నపాటి వర్షానికే, కంకర తెలి, మట్టి, ఇసుక రోడ్ల పైకి రావడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని తెలిపారు. ముఖ్యంగా చెరువు రోడ్డు నుంచి మడకశిర సర్కిల్ రోడ్డు వరకు రోడ్డు చాలా ఆద్వానంగా వుందని వెంటనే మరమ్మతులు చేయాలనీ కోరారు. అదేవిధంగా ఎస్ కె డి సర్కిల్ నుండి బాబయ్య స్వామి దర్గా రోడ్ వ్యాపార సముదాయలతో కుడి, జన సంచారం ఎక్కువ వున్న ఈ రహదారి మరమ్మతులు అవసరం వుందన్నారు. రైల్వే రోడ్డు నిత్యం ఆటోలు వందలాది ప్రయాణికులు ముఖ్యంగా మహిళలు, వృద్దులు, చిన్నారులు వస్తూ పోతుంటారు. ఆ రోడ్డు పూర్తి గా దెబ్బ తిన్నదని కొత్త రోడ్ ఏర్పాటు చేయాలనీ కోరారు. అంతేకాక పట్టణంలోని ఏవాడ లో చూసిన రోడ్ల పరిస్థితి దయానియంగా ఉందని, అవసరమైన చోట కొత్త రోడ్లు ఏర్పాటు చేయాలనీ, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థమై, మురికి నీరు రోడ్ల పైకి వచ్చి, దుర్గంధం రావడం వలన, ముక్కులు మూసుకుని దేవాలయాలకు పోతున్న పరిస్థితి వుందని, చారిత్రాత్మక విశిష్టత కలిగిన పెనుకొండకు కర్ణాటక, ఇతర ప్రాంతాల నుండి పర్యాటకులు వస్తుంటారు. అలాంటి గొప్ప చరిత్ర గల పెనుకొండలో రోడ్లు, డ్రైనేజీ పరిస్థితి చూసి పర్యాటకులు విస్తు పోతుంటారు అని చెప్పారు. కార్యక్రమంలో మండల నాయకులు బాబురావు, తిప్పన్న, తదితరులు పాల్గొన్నారు.

➡️