ప్రజాశక్తి- నందిగామ (ఎన్‌టిఆర్) : గత కొంతకాలంగా ఆనారోగ్యం తో బాధపడుతున్న కమ్మవారిపాలెం గ్రామ సిపిఎం శాఖ సభ్యులు కటారపు రాయప్పను సిపిఎం నందిగామ నాయకులు బుధవారం పరామర్శించారు. ఆనారోగ్యం నుండి త్వరగా కోలుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నందిగామ కార్యదర్శి కటారపు గోపాల్, సిపిఎం నాయకులు కరి వెంకటేశ్వరరావు, ఎసోబు, మంజూరు శ్రీనివాసరావు, అవి నారాయణ, గోపి నాయిక్ తదితరులు రాయప్పను పరామర్శ చేశారు.