ప్రజాశక్తి-నాగులప్పలపాడు: మండల పరిధిలోని నిడమానూరు గ్రామానికి చెందిన సిపిఎం సభ్యడు, గ్రామ మాజీ శాఖా కార్యదర్శి ఊదరగుడి ప్రసాద్ అనారోగ్యంతో మంగళవారం రాత్రి మతి చెందారు. ఈ విషయం గురించి తెలుసుకున్న సిపిఎం రాష్ట్ర, జిల్లా నాయకులు ప్రసాద్ భౌతికకాయాన్ని బుధవారం సందర్శించారు. ప్రసాద్ భౌతిక కాయంపై సిపిఎం జెండా కప్పి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ప్రసాద్ మతి సిపిఎంకు, ప్రజా పోరాటాలకు తీరని లోటని పలువురు వక్తలు పేరొన్నారు. ప్రసాద్ 1996లో సిపిఎంలో సభ్యుడి చేరినట్లు తెలిపారు. అప్పటి నుంచి ప్రజాపోరాటాల్లో చురుకైన పాత్ర పోషించారన్నారు. గ్రామంలో మద్యం షాపు ఉండటం వల్ల పేదకుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆషాపు ఉండడానికి వీలులేదని తీసివేసేంత వరకూ పోరాటం నిర్వహించారన్నారు.కూలీ పోరాటాలు, భూ పోరాటాలు ,కౌలు రైతుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారన్నారు. పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ పోరాటం నిర్వహించారన్నారు. తద్వార ప్రజల్లో మంచి గుర్తింపు పొందారన్నారు. సిపిఎం మండల కమిటీలో పనిచేసినట్లు తెలిపారు. తవనం చెంచయ్య సంతనూతలపాడు ఎమ్మెల్యే ఉన్న సమయంలో ఆయనతో కలిసి పనిచేస్తూ గ్రామంలోని సమస్యలను ఆయన దష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసేవారని తెలిపారు. అనేక పోరాటాలు నిర్వహించి ప్రజల మన్నలు పొందిన ప్రసాద్ మరణించటడం బాధాకరమని, వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు నివాళలర్పించిన వారిలో సిపిఎం కంట్రోల్ కమిషన్ చైర్మన్ ,రాష్ట్రకమిటీ సభ్యులు జాలా అంజయ్య,సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జె. జయంతిబాబు, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్‌కె. మాబు, సిపిఎం మండల కార్యదర్శి టి.శ్రీకాంత్ , నాయకులు జి.బసవపున్నయ్య, చీరాల ప్రభుదాస్ ,కాకాని సుబ్బారావు, రావెళ్ళ వెంకట్రావు, యు.వెంకటేశ్వర్లు, జె.సంజీవ తదితరులు ఉన్నారు.
