హామీలు వెంటనే నెరవేర్చాలి : సిపిఎం

ప్రజాశక్తి-కాశినాయన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలకు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హా మీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు మనోహర్‌, జిల్లా కమిటీ సభ్యులు అన్వేష్‌ పేర్కొన్నారు. మండల కేంద్రమైన నరసాపురంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు పెంచుతామని, ప్రతి మహిళకూ నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. తల్లికి వందనం, రైతులకు రూ. 20 వేల సాయం గురించి పూర్తిగా మరిచి పోయారని వాపోయారు. వీటిని అమలు చేయకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఉచిత ఇసుక కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మండలంలో అసైన్మెంట్‌ కమిటీ జరగకుండానే విచ్చలవిడిగా భూ కబ్జాదారులు బినామీ పట్టాలు పొంది కొన్ని వందల ఎకరాలు స్వాహా చేశారని చెప్పారు. పేదలు ఇబ్బంది పడుతున్నా ఏ ప్రభుత్వమూ పట్టిం చుకున్న దాఖలాలు లేవని పేర్కొన్నారు. వరికుంట్ల, ఇటుకలపాడు, సావి శెట్టిపల్లె, మూలపల్లె గ్రామాలలో డబ్బులున్న రాబందులు భూమి కబ్జా చేసి పేదలను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వమైన కమిషన్‌ ఏర్పాటు చేసి కబ్జాకు గురైన ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకొని పేదలకు పంపిణీ చేయాలని వారు డిమాండ్‌ చేశారు. సమావేశంలో సిపిఎం మండల నాయకులు పోలయ్య, కలసపాడు మండల నాయకులు ప్రవీణ్‌, పోరుమామిళ్ల నాయకులు వీరయ్య, కార్యకర్తలు బాబు, లక్ష్మయ్య, సుబ్బారావు పాల్గొన్నారు.

➡️