చల్లపల్లి (కృష్ణా) : చల్లపల్లి మండలం లక్ష్మీపురం శివారు రామనగరం కు చెందిన పాము నాంచారయ్య (70) అనారోగ్యంతో బాధపడుతూ శనివారం స్వగృహంలో మృతి చెందారు. ఆయనకు భార్య నాంచారమ్మ, కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. చిన్న వయసులోనే కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాల పట్ల ఆకర్షితుడై, 1990లో పార్టీ సభ్యత్వం తీసుకొని తుది శ్వాస వరకు ఎర్రజెండా నెలలో నీడలో కొనసాగారు. చల్లపల్లి జమిందార్ మిగులు భూముల పోరాటంలో పాల్గొని అరెస్టు చేయబడి జైలు జీవితం గడిపారు.. రామానగరంలో మిగిలి భూముల పంపిణీలో కీలక పాత్ర పోషించారు. 216 జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి అండగా నిలబడి పోరాటం చేసి ఆర్థిక సహాయం తీసుకు రావడంలో కీలకపాత్ర పోషించారు. రామానగరంలోని నివేశ స్థలాల కోసం పోరాటం చేసిన వ్యక్తిని వ్యక్తి. నాంచారయ్య పార్టీ ఎడల నీతి, నిజాయితీ , నిబద్ధతతో ఉంటూ ప్రజాశక్తి దినపత్రిక పెంచడంలో కృషి చేశారు. ఇటీవల వచ్చిన కృష్ణా నది వరద ప్రాంతాలలో బాధితులకు దుస్తులు పంపిణీలో పాల్గొన్నారు. పార్టీ పిలుపు ఇచ్చిన ప్రతి కార్యక్రమంలోనూ ఉత్సవంగా పాల్గనేవారు. ఆయన మరణ వార్త విన్న వెంటనే మండల పార్టీ కార్యదర్శి యద్దనపూడి మధు, కమిటీ సభ్యులు మహమ్మద్ కరీముల్లా, లంకపల్లి సత్యనారాయణ, కుంపటి బాబురావు, గ్రామ ప్రముఖులు ఊసా వెంకటేశ్వరరావులు నాంచారయ్య పార్థివ దేహాన్ని సందర్శించి, అరుణ పతాకం కప్పి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. ప్రగాఢ సంతాపం తెలిపారు, కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. పాము నాంచారయ్య మఅతి పట్ల సిపిఎం కృష్ణాజిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శీలం నారాయణరావు సంతాపం తెలియ జేసినారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.
