కడవకల్లులో సిపిఎం పార్టీ మహాసభ

Nov 2,2024 17:09 #anatapuram, #Mahasabha

ప్రజాశక్తి  – పుట్లూరు : మండలంలోని కడవకల్లు గ్రామంలో శనివారం సిపిఎం పార్టీ శాఖ మహాసభ జరిగింది. ఈ మహాసభకు ముఖ్య ఆహ్వానితులకు సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఓనల్లప్ప జిల్లా కమిటీ సభ్యులు ఎం కృష్ణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మండలంలో గత మూడు సంవత్సరాల కాలం నుండి పార్టీ ఆధ్వర్యంలో చేసిన కార్యక్రమాలపై సమీక్ష చేసుకొని భవిష్యత్తు కర్తవ్యాలను తీర్మానం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మండలంలో రైతాంగ సమస్యల పైన అరటి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని మార్కెట్ సౌకర్యం కల్పించాలని దళారీ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి అన్ని గ్రామాలలో పనులు కల్పించి వంద రోజులు పూర్తి చేసుకున్న కుటుంబాలకు 200 రోజులు పనులు కల్పించాలని మండలంలోని చెరువులన్నీటికి ఆంధ్రునివా తుంగభద్ర ద్వారా నీటిని అందించాలని సుబ్బరాయ సాగర్ ప్రాజెక్టు ద్వారా నీటిని వదిలి కుడి కాలువ ద్వారా చెరువుల అన్నిటికీ నింపాలని ఆయకట్టు రైతులకు నీరు నివ్వాలని వ్యవసాయ కార్మికులకు వలసలు నివారించే స్థానిక గ్రామాల్లోని పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానిక సమస్యలు మంచినీటి సౌకర్యం స్మశానాలు కంపచెట్లు తొలగించాలని తదితర సమస్యలపై మండలంలో ఆందోళన పోరాటాలు నిర్వహించాలని తీర్మానం చేశారన్నారు.
పుట్లూరు నూతన శాఖ కమిటీ ఎన్నిక
పుట్లూరు శాఖ కార్యదర్శిగా ఎస్ సూరి కమిటీ సభ్యులుగా నారాయణస్వామి జే పెద్దయ్య ప్రత్యేక ఆహ్వానితులుగా వెంకట చౌదరి నాగభూషణ, టీ పెద్దయ్య, భాస్కర్ రెడ్డి, రేవతి కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు వెంకట చౌదరి పెద్దయ్య నాగభూషణం భాస్కర్ కుల్లాయప్ప జె పెద్దయ్య ఆదినారాయణ యేసు రత్నం నరసింహులు పాల్గన్నారు.

➡️