విశాఖ : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక బడ్జెట్ పై సిపిఎం నిరసన తెలిపింది. కార్పొరేట్ అనుకూల, ప్రజా వ్యతిరేక బడ్జెట్ పై ప్రజలు నిరసన తెలపాలని అచ్యుతాపురం సిపిఎం కన్వీనర్ ఆర్. రాము అన్నారు. ఆదివారం అచ్యుతాపురం జంక్షన్ లో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేదలకు ఉపయోగపడే ఉపాధి హామీ వంటి పథకాలకు బడ్జెట్ లో మోడీ ప్రభుత్వం కేటాయింపులు తగ్గించిందని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే చర్యలు చేపట్టకుండా కార్పొరేట్ సంస్థలు లాభపడే విధానాలు అమలుచేస్తోందని విమర్శించారు. సంపన్నులకు రాయితీలిస్తూ, సామాన్యులపై భారాలు వేస్తోందని అన్నారు. ఆహార సబ్సిడీలు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివఅద్ధి, సామాజిక సంక్షేమంపై కోత పెడుతుందన్నారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై భాగస్వామ్య పార్టీలు టిడిపి, జనసేన మాట్లాడపోవడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గూడూరు వరలక్ష్మి, సీనియర్ నాయకులు కే. రామ సదాశివరావు అచ్చుతాపురం శాఖ కార్యదర్శి కే. సోమనాయుడు పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
