ప్రజాశక్తి – ఫిరంగిపురం : మండలంలోని 113 తాళ్లూరు గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ నాయకులు డాక్టర్ రావిపాటి వెంకటరత్నం (87) అనారోగ్యంతో సోమవారం రాత్రి మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. ఆయుర్వేద వైద్య విద్యను అభ్యసించిన వెంకటరత్నం ఫిరంగిపురం మండలంలో తక్కెల్లపాడు, సిరంగిపాలెం, 113 తాల్లూరు గ్రామాల్లో ఇంటింటికి తిరిగి వైద్యసేవలు అందించేవారు. చిన్నప్పటి నుండి కమ్యూనిస్టు పార్టీ పట్ల ఎనలేని అభిమానం ఉన్న ఆయన అగ్రనేత పుచ్చలపల్లి సుందరయ్య ఆదర్శాలను, నీతి, నిజాయితీలను, నిరాడంబరతను, సేవాగుణాణ్ణి పాటించేవారు. ఈ ఆదర్శాలను కొనసాగిస్తూ ఆయన తన శరీరానీ అవయవదానంగా చేయాలని కుటుంబానికి చెప్పారు. సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శిగా, సత్తెనపల్లి డివిజన్ కమిటీ సభ్యునిగానూ పని చేయిన ఆయన చివరి వరకూ సిపిఎం సిద్ధాంతాలు, విధానాలకు అంకితమై పనిచేసిన ఆయన ఎన్నో కష్టాలను ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. ఎంతో క్రమశిక్షణతో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. సిపిఎం కార్యకర్తలను సొంతవారిలా చూసుకునేవారు. వెంకటరత్నం ప్రజాశక్తి పత్రిక ఏజెంట్‌గానూ నిబద్ధతతో పనిచేశారు. పత్రికను మూడు గ్రామాల్లో సైకిల్‌పై వెళ్లి పాఠకులకు చేర్చేవారు. ఆయన మృతికి సిపిఎం గుంటూరు జిల్లా కమిటీ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఆ జిల్లా కార్యదర్శి వై.నేతాజి ఒక ప్రకటన జారీ చేశారు. సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ ఎ.లకీëశ్వరెడ్డి, వై.రాధాకృష్ణ సంతాపం ప్రకటించి వెంకటరత్నంతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
