ప్రజాశక్తి-టంగుటూరు (ప్రకాశం) : సిపిఎం పార్టీ చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర చింతలపాలెం, రామనాధపురం గ్రామాల్లో బుధవారం కొనసాగింది. ఈ రెండు గ్రామాల మధ్య ఉన్న పాలేరు పై చప్ట లేనందున, రోడ్డు లేనందున మేము చాలా ఇబ్బంది పడుతున్నాము అని ఆ గ్రామాల ప్రజలు సిపిఎం బృందం దృష్టికి తీసుకొనివచ్చారు. ఈ బృందానికి చప్టా నిర్మించాల్సిన ప్రాంతాన్ని , గుంతలు పడి, ఇసుకతో ఉన్న రోడ్డుని చూపించి రాకపోకలకు చాలా ఇబ్బంది పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రామనాధపురం గ్రామంలో రోడ్డు కి ఒక వైపు నందనవనం పంచాయతీ లో రెండో వైపు పలుకూరు పంచాయతీలో ఉండటం వల్ల మాకు చాలా ఇబ్బంది కరంగా ఉందని ప్రజలు బృందానికి తెలిపారు. ఈ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కాారం చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమం లో సిపిఎం నాయకులు జీ. శ్రీనివాస్, టీ. రాము, వి. మోజెస్,తానికోండ నారాయణరావు, తన్నీరు సుబ్బారావు, దావులూరి కృష్ణ , ప్రజలు పాల్గొన్నారు.
