పేదలకు మూడు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలి : సిపిఎం

ప్రజాశక్తి -గోపవరం ఆక్రమణదారుల నుంచి భూములు స్వాధీనం చేసుకుని ప్రతి పేద కుటుంబానికి మూడు సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని సిపిఎం మండల కార్యదర్శి డి. వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు. బద్వేల్‌ మండలం సి కొత్తపల్లె రెవెన్యూ పొలం సర్వే నెంబర్లు 46 45 47 54 56 57లలో చాలా మంది కబ్జాదారులు ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని ముల్లతీగ నాటుకొని కబ్జా చేశారని పేర్కొన్నారు. మంగళవారం ఆక్రమిత భూముల్లో పేదలతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సి.కొత్తపల్లి రెవెన్యూ పొలంలో వందలాదిమంది పేదలు పేదలు గతం ఇచ్చిన అనుబంధాలలో బేస్‌మట్టాలు, గుడిసెలు, రూములు కట్టుకుని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. కొందరు కబ్జా దారులు పేదల నుంచి స్థలాలు లాక్కొని కబ్జా చేస్తున్నారని పేర్కొన్నారు. బాధితులు అధికారులకు విన్నవించిన్నా పట్టించుకోలేదని వాపోయారు. వెంటనే రెవెన్యూ అధికారులు కబ్జా దారుల నుంచి భూమని స్వాధీనం చేసుకుని పేదలకు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే వందలాది పేదలను ఐక్యం చేసి కబ్జాగురైన భూమిలో ఎర్రజెండాలు పాతి తాము అర్హులకు ఇంటి స్థలాలు, భూములు ఇస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం బద్వేల్‌ రూరల్‌ కమిటీ సభ్యులు జి. జయరాజు, ఎన్‌.ఓబులేష్‌, ఎన్‌. రాంబాబు, దుర్గమ్మ, మరియమ్మ, సునీత, పేదలు పాల్గొన్నారు.

➡️