ప్రజాశక్తి – ఒంగోలు : నవంబర్ 8 నుండి 14 వరకు ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజల సమస్యల మీద గ్రామాల్లో సర్వే చేసిప్రజా పోరు కార్యక్రమం చేపట్టడం జరిగినది. దాని సందర్భంగా గురువారం వెలిగండ్ల మండల తాసిల్దార్ సువర్ణగారికి ప్రజా సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ నాయకులు రాయల మాలకొండయ్య పాల్గొనిమాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరల అదుపునకు చర్యలు తీసుకోవాలని ,ఉచిత ఇసుకవిధానం నేటికీ అమలుకు రాలేదని వెంటనే వచ్చేలా చూసి భవన నిర్మాణ కార్మికులకు, యజమానులకు న్యాయం చేయాలని, విద్యుత్తు ట్రూ ఆఫ్ చార్జీల కోసం స్మార్ట్ మీటర్లు బిగించే ప్రయత్నం ఉపసంహరించుకోవాలని, గ్రామాలలోగణేశుని కండ్రిక బీసీ, ఎస్సీ కాలనీలలో రోడ్లు, త్రాగునీరు , విద్యుత్తు లైను కొన్ని లేవని, కరెంటు బిల్లులు కట్టుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారని, దానికి ప్రత్యమ్మాయ మార్గం బిల్లులు కట్టుకోవటానికి బిల్లు కలెక్షన్ నునియమించాలని, పందు వగ్రామంలో ఎస్సీ తూర్పు లైన్ లో విద్యుత్తు లైను లేదని,కమ్యూనిటీ హాలు కావాలని, సూధనగుంట ఎస్సీ కాలనీలోసిమెంట్ రోడ్డు మంజూరు చేయించాలని, ఆగిపోయిన అంతర్గత రోడ్లు పద్మాపురం ,బల్లవరం ,నరసమాంబపురం, చందలూరుపాడు కే, యన్ ,పురం,టు నాగిరెడ్డిపల్లి ఆర్.జి.పురం టు గుమ్మలకర్ర ,గన్నవరం పాలేరు వాగు బ్రిడ్జి మరియు రోడ్డు , వె ధుల చెరువు మెయిన్ రోడ్డు టు బాల వెంగ న పల్లి గ్రామాలకు తారు రోడ్డు చేపట్టాలని,, వెంగల్రెడ్డిపల్లి టు ఆర్, ల్ ,పురం మెయిన్ రోడ్డు వరకు రాళ్లపల్లి, ముసలిపల్లి గ్రామాల్లో మెయిన్ బజార్లలో సిమెంట్ రోడ్డు చాలా లోతులో ఉన్నదని, అలాంటి గ్రామాల్లో తక్షణమే సిమెంట్ రోడ్లు నిర్మించాలని, రైతుల పండించుకున్న సజ్జ పంటను ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ద్వారా కొనుగోలు చేయాలని, ఇమ్మడి చెరువు తదితరఎస్సీ కాలనీలో డ్రైనేజీ పూడికతీత చేపట్టాలని, వెదుళ్లచెరువు టు సిఎస్పురం మండలం అరైవేముల అడవి మార్గంలో పది కిలోమీటర్ల లింకు రోడ్డు చేపట్టాలని, తదితర సమస్యలు వె లుగులోకి వచ్చాయని వారన్నారు. ఈ కార్యక్రమంలో కండే బాలకృష్ణ ,పగడాల చక్రిరావు ,సిగినం తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.