మాట్లాడుతున్న ఎం మోహన్‌రావు
కంటైనర్ టెర్మినల్‌ను ప్రారంభించాలి : సిపిఎం
ప్రజాశక్తి – వెంకటాచలం :కృష్ణపట్నం పోర్టులోని కంటైనర్ టెర్మినల్‌ను తక్షణమే ప్రారంభించాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం మోహన్‌రావు డిమాండ్ చేవారు. మండలంలోని తిక్కవరపాడులో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మోహన్‌రావు పాల్గొని ప్రసం గించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం కలిసికట్టుగా కషి చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. కష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ రవాణాను వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయింపు పెంచాలని, రైతులు పండించిన పంటలకు సరి అయిన సరియైన మద్దతు ధర కల్పించాలని అన్నారు. కార్మిక చట్టాల సవరణ పేరుతో తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కోరారు. క్రిమినల్ చట్టాల సవరణ బిల్లులను వెంటనే ఆపివేయాలన్నారు. తరగ తులకు మండల కార్యదర్శి ఓడూరు వెంకటకష్ణ అధ్యక్షత వ్యవహరించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు గోగుల శ్రీనివాసులు, కమిటీ సభ్యులు చెంచు రామన్న, వెంకట శేషయ్య, శ్రీనివాసులు, సుధాకర్, వెంకయ్య,వేణు, చాన్ బాషా ఉన్నారు.
