ప్రజాశక్తి-చీమకుర్తి : గాజాపై దాడులు ఆపాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక పంగులూరి కష్ణయ్య భవనం సెంటర్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకూ సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహిం చారు. బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సిపిఎం మండల కార్యదర్శి పూసపాటి వెంకట్రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్‌కె.బాబు మాట్లాడుతూ ఇజ్రాయిల్ గత ఏడాదిగా గాజపై చేస్తున్న యుద్ధం వల్ల సుమారు 42 వేల మంది చనిపోయారని తెలిపారు. దాడులలో విద్యాలయాలు, వైద్య సంస్థలు ధ్వంసం అయ్యాయని పేర్కొన్నారు. అందుకు కారణమైన న్యాహుని అంతర్జాతీయ సమాజం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. శాంతిని కాపాడాలని కోరారు. ఇజ్రాయిల్‌కు సహకరిస్తున్న అమెరికన్ సామ్రాజ్య వాదం నశించాలని పేర్కొన్నారు. శాంతిని పెంపొందించే విధంగా భారత ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తున్న ఇజ్రాయిల్ అధ్యక్షుడు నేత న్యాహును అంతర్జా తీయ సమాజం బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ నాయకులు పల్లాపల్లి ఆంజనేయులు, కుమ్మిత శ్రీనివాసులు రెడ్డి, క్రిష్టిపాటి చిన్నపురెడ్డి, బెజవాడ శ్రీను, కొల్లూరు వెంకటేశ్వర్లు, తొట్టెంపూడి రామారావు, నల్లూరి కష్ణయ్య, ఖరీదు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
