ఘగర్‌ ఫ్యాక్టరీలను వెంటనే ఆదుకోవాలి : సిపిఎం

అనకాపల్లి : ఘగర్‌ ఫ్యాక్టరీలను ఆదుకుంటామని జిల్లాలోని అన్ని ఘగర్‌ ప్యాక్టరిలను తెరపిస్తామని ఎన్నికల ముందు అనకాపల్లి పార్ల మెంట్‌ సభ్యులు సిఎం రమేష్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, రైతు కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గోవాడ ఘగర్‌ ప్యాక్టరిలో శుక్రవారం నుండి కార్మికులకు, జీతాలు చెల్లించాలని రిటైర్డ్‌ అయిన కార్మికులు గ్రాడ్యుయేట్‌ ఇవ్వాలని పెన్షన్‌ మంజూరు చేయాలని చేస్తున్న ఆందోళనకు సిపిఎం సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తుందని తెలిపారు. గత సంవత్సరం రైతులు వేసిన చెరకుకు ఇప్పటి వరకు బకాయిలు చెల్లించకపోవడం దుర్మార్గమన్నారు సహకార రంగాన్ని కాపాడుతారని కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేసిన రైతు కార్మిలకు ఇదో గునపాఠంగా భవిష్యత్తు గుర్తుంచుకుంటారని తెలిపారు ముఖ్యంగా పార్లమెంట్‌ సభ్యులు సిఎం రమేష్‌ రైతులను కార్మికులను నమ్మాంచి మోసం చేసారని తెలిపారు,ప్రతి సంవత్సం నవంబర్‌ చివరి డిశంబరు రెండవ వారంలో ప్యాక్టరి క్రెషింగ్‌ జరగ వలసి ఉండగా ఇప్పటి వరకు క్రెషింగ్‌ ప్రాంభించక పోవడం రైతుల్లో అందోళన మొదలు అయ్యిందని తెలిపారు,చేరుకు వేసిన ఫేమెంట్లు ఇస్తారని గ్యారంటీ లేక ప్రవేటు ప్యాక్టరిలు వైపు రైతులు చూస్తున్నారని తెలిపారు, సంక్రాంతి వస్తున్న కార్మికులు బకాయిలు కాదు కదా కనీసం జీతాలు కూడా ఇవ్వక పోతే కార్మికులు ఎలా పండగ చేసుకుంటారని ప్రశ్నించారు. ఇప్పటి కైనా జీతం వేస్తే ఆందోళన విర మిస్తామని లేకుంటే ఇలాగే ధర్నా చేస్తామని హెచ్చరించ రించిన రాత్రి 9 వరకు కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో కార్మికులు అలాగే అక్కడే ఉండిపోయారని వీరి సమస్య పరిష్కారం చేయవలసిన ఘగర్‌ ప్యాక్టరి ఎం,డి.లేచి వెళ్ళి పోవడం అత్యంత దుర్మార్గ మన్నారు ,వెంటనే కార్మికులు రైతులు బకాయిలు చేల్లించ కుంటె సిపిఎం ప్రత్యేక్ష పోరాటానికి పూనుకుంటుందని వెంకన్న స్పష్టం చేసారు,

➡️