విలేకరులపై దురుసుగా మాట్లాడిన ఈవో ఆర్‌ డి ని సస్పెండ్‌ చేయాలి : సిపిఎం

ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : విలేకరులపై దురుసుగా మాట్లాడిన ఈవో ఆర్‌ డి ని వెంటనే సస్పెండ్‌ చేయాలని సిపిఎం నేతలు డిమాండ్‌ చేశారు. శుక్రవారం బాలాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో విలేకరులపై దురుసుగా మాట్లాడిన యు ఓ ఆర్‌ డి వెంటనే సస్పెండ్‌ చేయాలని సిపిఎం పార్టీ పుట్లూరు మండల కమిటీగా డిమాండ్‌ చేస్తున్నామన్నారు. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి సూరి మాట్లాడుతూ … మీడియా మిత్రులపై విలేకరులపై యు ఆర్‌ డి దుర్భాషలాడటం చాలా నీచమైన చర్య ఇలాగే ప్రవర్తిస్తే విలేకరుల పక్షాన సిపిఎం పార్టీ నిత్యం పోరాటాలు చేస్తుందని వెంటనే ఆయనను సస్పెండ్‌ చేసి చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో ని కోరుతున్నామన్నారు. లేనిపక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎంపీడీవో ఆఫీస్‌ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. యుఆర్టి జలాన్‌ భాష ఎంపీడీవో ఆఫీస్‌ కు వచ్చే ప్రజలను కూడా దురుసుగా మాట్లాడుతున్నారని ప్రజలు వాపోతున్నారు. ఆయన ప్రవర్తనను మార్చుకొని ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. ఆయన ప్రవర్తన ఇలాగే కొనసాగిస్తే రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి జి వెంకట చౌదరి, నాయకులు టీ పెద్దయ్య భాస్కర్‌ రెడ్డి, నాగభూషణం, జె.పెద్దయ్య, పుల్లయ్య, సుబ్బరాయుడు, లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

➡️