ప్రజాశక్తి – నెల్లూరు : నెల్లూరు సిటీలో చేపట్టిన సిపిఎం ప్రజాపోరు ముగింపు సందర్భంగా గాంధీ బొమ్మ సెంటర్ నుండి భారీ ర్యాలీ, అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట మహా ధర్నా జరిగింది. ఈరోజు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఈ ప్రజాపోరు కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రజలు, సిపిఎం శ్రేణులు తరలివచ్చారు. ఈ సందర్భంగా నగరంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించేందుకు తక్షణమే తగు చర్యలు చేపట్టాలి అని వారు డిమాండ్ చేశారు. కరెంట్ బిల్లుల్లో వేల కోట్ల రూపాయల ట్రూ అప్ చార్జీల భారం మోపడం తగదు. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించే చర్యలు ఆపాలి ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు డిమాండ్ చేశారు. నగరంలో పేద, మధ్యతరగతి వారు నివసించే ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలి. పట్టణాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి. టిడ్కో లబ్ధిదారులకు గృహాలను వెంటనే స్వాధీన పరచాలి. టిడ్కో ఇళ్లలో మౌలిక సదుపాయాలను కల్పించాలి. మహిళలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టాలి అని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ – నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కు అర్జీ ఇచ్చేందుకు ఛాంబర్ వద్దకు వెళ్లగా, ఎక్కువ సమయం వేచి చూసి అసంతృప్తితో సిపిఎం నేతలు వెనుదిరిగారు.