ప్రజల పక్షాన నిలిచేది సిపిఎం

Apr 17,2024 21:48

కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణ

ప్రజాశక్తి-కొమరాడ  : నిత్యం ప్రజల పక్షాన ఉంటూ సమస్యలపై పోరాటం చేస్తున్న సిపిఎం ఎమ్మెల్యే, ఎమ్‌పి అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణ కోరారు. బుధవారం మండలంలోని మసీమండ , పెదపెడుము, జల, కొండకూనేరు, అంటివలస, రాజ్యలక్ష్మిపురం, కుమ్మరిగుంట, కందివలస, కోనవలస, గంగభద్ర గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో రమణకి గిరిజనులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కుస్తీ పడుతూ, కేంద్రంలో దోస్తీగా కలిసిపోయే పార్టీలను నమ్మొద్దని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గిరిజన వ్యతిరేక చట్టాలను ఈ పార్టీలన్నీ బలపరుస్తూ గిరిజనులకు అన్యాయం చేస్తున్నాయని తెలిపారు. ఇలాంటి సందర్భంలో గిరిజన హక్కులను కాపాడే ఎర్రజెండా పార్టీ తరఫున పోటీచేస్తున్న వారిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఇందిరా, జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి, గిరిజన నాయకులు కె.సాంబమూర్తి, కె.బాలకృష్ణ, సుబ్బారావు, బి.రాజు, ప్రసాద్‌, బాబూరావు, శంకర్రావు, మధు, కైలాష్‌, జనార్దన పాల్గొన్నారు.

➡️