ప్రజాశక్తి – కోటనందూరు : సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు బేబీ రాణి ప్రజా చైతన్య యాత్రలో భాగంగా మంగళవారం నాడు బోధవరం గ్రామంలో పర్యటించి ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి అధికారం చేపట్టి సుమారు సంవత్సరం కాలం అవుతున్నప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రజలకు అందజేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు.మహిళలందరికీ ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి నెలకు 1500 ఇస్తామని , ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ,ఇంట్లో ఎంతమంది చిన్నపిల్లలు ఉంటే వారందరికీ తల్లికి వందనం పథకాలు, ప్రజలకు తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. కరెంటు చార్జీలు పెరగడం వలన సామాన్య ప్రజలపై పెను భారం పడిందని అన్నారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని అన్నారు. ఈ కార్యక్రమంలోసిపిఎం నాయకులు షేక్ పద్మ, ఎన్. శ్రీనివాస్, ఎం. లక్ష్మి, గడ్డం లక్ష్మి, అప్పలనర్స అరవాలమ్మ, స్రవంతి, మంగ కృష్ణ, బాబ్జి పాల్గొన్నారు.
