ఉద్యమ్‌ రిజిస్ట్రేషన్‌పై అవగాహన కల్పించండి..

Dec 11,2024 21:06
ఫొటో : మాట్లాడుతున్న ఎంపిడిఒ ఐజాక్‌ప్రవీణ్‌

ఫొటో : మాట్లాడుతున్న ఎంపిడిఒ ఐజాక్‌ప్రవీణ్‌

ఉద్యమ్‌ రిజిస్ట్రేషన్‌పై అవగాహన కల్పించండి..

ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి తరహా పరిశ్రమలు, షాపులు నిర్వహించుకునే వారికి ఉద్యమ్‌ రిజిస్ట్రేషన్‌పై అవగాహన కల్పించి వాటిని నమోదు చేయించేలా చర్యలు తీసుకోవాలని ఎంపిడిఒ ఐజాక్‌ప్రవీణ్‌ సచివాలయ సిబ్బందికి తెలిపారు. బుధవారం మండలంలోని బట్టేపాడు, అప్పారావుపాళెం సచివాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బంది బయోమెట్రిక్‌ హాజరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు సచివాలయాల్లో నిర్వహిస్తున్న సర్వేలను క్రమపద్ధతిలో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఇంటి పన్నుల వసూలుకు సంబంధించి ఆన్‌లైన్‌ ప్రక్రియను మండలంలో నూరుశాతం పూర్తి చేశారన్నారు. ఎంఎస్‌ఎంఇ సర్వేను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఉద్యమ్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రభుత్వ పథకాల ద్వారా తాము నిర్వహించే సంస్థలను అభివృద్ధి చేసేందుకు ఈ రిజిస్ట్రేషన్‌ ఉపయోగపడతుందన్నారు. అదే విధంగా అర్హులైన వారు ఎవరైనా హౌస్‌ హోల్డ్‌ మ్యాపింగ్‌లో నమోదు కానట్లతే వారిని గుర్తించి మ్యాపింగ్‌ చేయాలన్నారు. అదేవిధంగా బట్టేపాడు సచివాలయంలో జరుగుతున్న ఆధార్‌ క్యాంపును పరిశీలించారు. ఆయనవెంట ఇఒపిఆర్‌డి, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది ఉన్నారు.

➡️