విశాఖలో క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్ పో ప్రారంభం

Nov 29,2024 16:37 #viziag

ప్రజాశక్తి  – ఎంవిపి కాలనీ : విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని గాది రాజు ప్యాలస్ వేదిక నిర్వహిస్తున్న క్రెడాయ్ 10వ ఎడిషన్ ప్రాపర్టీ ఎక్స్ పో ను శుక్రవారం ఉదయం భీమిలి ఏంఎల్ఏ గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభ కు ముఖ్య అతిధులుగా విశాఖ నగరం తూర్పు నియోజకవర్గం ఏంఎల్ఏ వెలగపూడి రామకృష్ణ బాబు , దక్షిణ నియోజకవర్గం ఏంఎల్ఏ వంశి కృష్ణ శ్రీనివాస్ యాదవ్ , ఉత్తర నియోజకవర్గం ఏంఎల్ఏ పి.విష్ణు కుమార్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంశి కృష్ణ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ .. వచ్చే ఫిబ్రవరి నుండి రియల్ ఎస్టేట్ బూమ్ పెరుగుతుందని , నగరానికి ఎయిర్పోర్ట్, కనెక్టివిటీ రోడ్, మెట్రో అన్ని వస్తున్నాయని , మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ బిల్డర్స్ సమస్యల పై ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. అనంతరం పి. విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బిల్డర్స్ అండగా ఉంటుంది. గడిచిన 5 ఏళ్లు గా రాష్ట్రం లో దుర్మార్గపు పాలన జరిగిందని అన్నారు. ఎవరికి ఏ సమస్య ఉన్న రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతామని హామీ ఇచ్చారు. 2026 జూన్ నాటికి భోగా పురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తుందని, స్టీల్ ప్లాంట్ నుండి భోగాపురం వరకు మెట్రో తో పాటు దానికి అనుగుణం గా ఫ్లై ఓవర్ లు నిర్మిస్తామని అన్నారు. మోడీ అందరికీ ఇల్లు ఉండాలన్న ఉద్దేశం తో ఆంధ్ర కు 7లక్షల ఇళ్లు ఆమోదించారని కానీ జగన్ మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేసిన 4.4 లక్షల ఇళ్లు రద్దు చేశాడని అన్నారు. వెలగపూడి రామకృష్ణ బాబు మాట్లాడుతూ రాష్ట్రం ఇప్పుడిప్పుడే ఒక గాడిలో పడుతుందని భవిష్యత్తు లో వైఎస్ఆర్సీపీ కి మాత్రం మరల ఓటు వేయకండి అని అన్నారు. ఇంతటి రాక్షస పరిపాలన గతంలో ఎన్నడు ఎన్నడూ చూడలేదని అన్నరు. జగన్ ను వందేళ్లు జైలు లో పెట్టిన తప్పు లేదని అన్నారు. గత 5 ఏళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా టిడియర్ కుంభకోణాలు జరిగాయని , ఇసుకను అందరికీ అందుబాటులోకి తెచ్చామని అన్నారు. గత ప్రభుత్వం విశాఖను గంజాయికి రాజధాని గా చేసిందని అన్నారు.
విశాఖపట్నం క్రెడాయ్ అధ్యక్షులు కె ఎస్ ఆర్ కె రాజు(సాయి) మాట్లాడుతూ నేటి నుండి ౩ రోజుల పాటు సాగనున్న ఈ ప్రాపర్టీ ఎక్స్ పో లో సుమారు 71కి పైగా ప్రముఖ నిర్మాణరంగ సంస్థలు పాల్గొని తమ వ్యాపార కార్యకలాపాలను వినియోగదారులకు ప్రదర్శిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా, యుబిఐ, ఎల్ఐసి, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఐడిఎ తదితర జాతీయ బ్యాంకులు, 7 ప్రముఖ స్టీల్ కంపెనీలు, 35 ఇంటీరియర్ అండ్ ఎక్స్ టీరియర్ కంపెనీలు కూడా పాల్గొంటాయని తెలిపారు. ప్రతి గంటకు ఒక గ్రాము, ప్రతి రోజు ఒక 5 గ్రాముల బంగారు నాణెలను మెగా బహుమతి గా ఒక హోండా యాక్టివా వాహనాన్ని వినియోగదారులకు అందిస్తున్నామని  అన్నారు. కార్యక్రమం లో భాగంగా ప్రతి ఏటా ఇచ్చే కె.సుబ్బరాజు మెమోరియల్ అవార్డులను సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఉత్తమ ప్రతిభ కనబరచిన దాడి ప్రశాంత్, మంగ జయ లక్ష్మి, తర్లి కుసుమ శ్రీ లకు అతిధుల చేతుల మీదుగా అందించారు. ఈ ఎక్స్ పో లో విఏంఆర్డిఏ స్టాల్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. ఈ కార్యక్రమం లో ఎక్స్ పో కన్వీనర్ సిహెచ్ గోవిందరాజు క్రెడాయ్ విశాఖపట్నం చైర్మన్ బాయన శ్రీనివాస్ , ఉపాధ్యక్షులు వి.ధర్మేంద్ర , వి శ్రీను, గౌరవ కార్యదర్శి ఇ.అశోక్ కుమార్, విఏంఆర్డిఏ జాయింట్ కమిషనర్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

➡️