క్రికెట్‌ టోర్నమెంట్లు ప్రారంభం

Jan 12,2025 00:10 #cricket tournament
Cricket Tournament

 ప్రజాశక్తి -యంత్రాంగం ఉక్కునగరం : జివిఎంసి 87వ వార్డు పరిధిలో ఏర్పాటుచేసిన సంక్రాంతి ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను కార్పొరేటర్‌ బోండా జగన్నాధం శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ సందర్భంగా టోర్నమెంట్‌ నిర్వహించడం అభినందనీయమన్నారు. సిద్ధార్థనగర్‌కు ఆనుకొని ఉన్న 4.30 ఎకరాల స్థలంలో సుమారు రూ.2 కోట్లతో స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, వచ్చే ఏడాదికి పనులు పూర్తవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు అభివృద్ధి కమిటీ చైర్మన్‌ విజయరామరాజు, జనసేన నాయకులు ఇందిరా ప్రియదర్శిని, ప్రగడ వేణుబాబు, బొడ్డ గోవింద, కోమటి శ్రీను, ప్రగడ శ్రీను, కొన్న నారాయణ, దానప్పలు, సన్యాసిరావు, గోవిందరాజు, రమణ, రవి, నారాయణ, ఆర్గనైజింగ్‌ సభ్యులు పాల్గొన్నారు.రేవిడిలో పద్మనాభం : సంక్రాంతి సందర్భంగా మండలంలోని రేవిడి గ్రామ పంచాయతీ పరిధిలో క్రికెట్‌ టోర్నమెంట్‌ను శనివారం లావణ్య లహరి గ్రూప్‌ అధినేత గొలగాని శ్రీనివాస్‌ ప్రారంభించారు. కె.సురేష్‌, బంగారునాయుడు, గౌతమ్‌ సమర టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఆది ఆర్మీ సూపర్‌ కింగ్‌, జెడి కె లారెన్స్‌, ఎస్‌బిటి లివిస్‌, సమల వారియర్స్‌, టీం వైపర్‌ జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రొ కబడ్డీ తెలుగు టైటానిక్‌ సిఇఒ త్రినాథ్‌రెడ్డి, స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌, ఎంపిటిసి సభ్యులు సూరప్పడు, నాయకులు బి.అప్పలనాయుడు, ఎం.అప్పారావు, జె.అప్పారావు, రామకృష్ణ, ఎం.రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️