రాయదుర్గం (అనంతపురం) : రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామం వద్ద మంగళవారం నిప్పంటుకొని ఉలవ పంట వాములు కాలిపోయాయి. గ్రామానికి చెందిన రైతు గురుసిద్ధప్ప ఉలవ పంట సాగు చేసి పంట నూర్పిడి కోసం ఎనిమిది వాములను వేయగా ఈరోజు నిప్పంటుకొని ఆ నాలుగు పంటవాములు కాలిపోయాయి. అగ్నిమాపక దళం సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశాయి. ఈ ఘటనలో నాలుగు పంటవాములు మంటల నుండి రక్షించబడ్డాయి.
