భారీ వర్షాలకు నీటి మునిగిన పంటపొలాలు

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : రుతుపవనాల ద్రోణి ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు మండల పరిధిలోని 18 గ్రామాలలో రైతులు సాగు చేసిన వరి చేలు నీటి మునిగాయి. అయితే మండల పరిధి 18 గ్రామాలలో 9,250 ఎకరాల్లో రైతులు వరిసాగు చేసినట్లు మండల వ్యవసాయ అధికారి లక్ష్మి లావణ్య తెలిపారు. నీట మునిగిన వరి చేలు దుస్థితిపై అధికారిణిని ప్రజాశక్తి శుక్రవారం ప్రశ్నించగా ఎక్కువ రోజులు వర్షపు నీటిలో నిల్వ ఉంటే వరిమూనలు చనిపోయే ప్రమాదం ఉందన్నారు. ఒకటి, రెండు రోజులకు రైతులు కంగారు పడాల్సిన అవసరం లేదని ఆమె వివరించారు. ఇదిలా ఉండగా నేడు కొత్తపేట నియోజకవర్గ జనసేన ఇన్చార్జి బండారు శ్రీనివాసరావు, జనసేన నాయకులు, మాజీ ఎంపిటిసి నాగిరెడ్డి వెంకటేశ్వరరావు (బాస్‌), సర్పంచ్‌ సంగీత సుభాష్‌, జనసేన మండల అధ్యక్షుడు సూరపురెడ్డి సత్య, పార్టీ శ్రేణులతో కలసి విస్తఅత పర్యటనలో భాగంగా క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.

➡️