ప్రజాశక్తి – వేపాడ (విజయనగరం) : ఈరోజు వేపాడ మండలం నీలకంఠ రాజపురం అగ్రహారంలో వేరుశనగ పంట ప్రయోగం సహాయ గణాంక అధికారి రామకృష్ణంరాజు , మండల వ్యవసాయ అధికారి యశ్వంతరావు ఆధ్వర్యంలో పంట కోత ప్రయోగాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు ప్రసాదు, రైతులు పాల్గొన్నారు. 5X5 విస్తీర్ణం మీటర్లలో దిగుబడి 8.25 కేజీలు వేరుశనగ దిగుబడి వచ్చిందని రామకృష్ణంరాజు తెలిపారు.
