‘పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి’

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌ రైతు పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 29, 30, 31వ తేదీల్లో రాష్ట్ర స్థాయి రైతు సమ్మేళనాన్ని నిర్వహి స్తున్నట్లు ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రామానాయుడు అన్నారు. గురు వారం రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్‌లో కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లెలో జరిగే రాష్ట్ర స్థాయి సమ్మేళన సమావేశాలలో రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు ఎదుర్కొంటున్నసమస్యల పైన సుదీర్భంగా చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వ్యవ సాయ సంక్షోభానికి మూలకారణాలను విశ్లేషించి రైతులను రుణగ్రస్తులు కాకుం డా కాపాడాలని, ఉచిత విద్యుత్‌కు మంగళం పాడే విద్యుత్‌ బిల్లును రద్దు చేయా లని, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు ప్రకటించాలని, కౌలు రైతు లను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న నీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్‌.నరసింహులు మాట్లాడుతూ మదనపల్లె పట్టణంలో టమోటా ఆధారిత పరిశ్రమలు, పాడి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, హంద్రీ-నీవా ప్రాజెక్టు పూర్తి చేసి రైతు పొలాలకు నీరు అందించడంతో పాటు మదనపల్లె ప్రాంతాన్ని హార్టిక ల్చర్‌ హబ్‌గా అభివద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో ఎక్కువగా వర్షా ధారిత పంటలే కావడం వల్ల గత మూడేళ్లు గా అతివష్టి అనావష్టి కారణంగా రైతాంగం నష్టపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించడంలో ప్రభుత్వం విఫల మైందన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు టి.కృష్ణప్ప, సాంబ శివ, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కె.మురళి, రెడ్డి, రవి, రెడ్డెప్ప పాల్గొన్నారు.

➡️