పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న యుటిఎఫ్ నాయకులు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : దీర్ఘకాలంగా అపరీష్కృతంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిం చాలని యుటిఎఫ్ కోరింది. ఈ మేరకు బుధవారం నరసరావుపేట కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజరు గనోరేను నాయకులు కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాసరెడ్డి, ఎం.మోహనరావు మాట్లా డుతూ 12వ పిఆర్‌సి కమిషన్‌ను వెంటనే ప్రకటించి ఆర్థిక బకాయిలు విడుదల చేయాల న్నారు. 2023 జులై నుండి అమలు కావాల్సిన 12వ పే రివిజన్ కమిషన్‌పై నేటికి కమిటీని నియమించకపోవడంతో ఉద్యోగ ఉపాధ్యా యుల 12వ పిఆర్‌సిని 18 నెలల కాలాన్ని కోల్పోవాల్సి వచ్చిందని చెప్పారు. 11వ పిఆర్‌సి బకాయిలు రూ.7384 కోట్లు, డిఎ బకాయిలు రూ.9650 కోట్లు, ఎంప్లారు సరెండర్ లీవ్ రూ.2250 కోట్లు, సిపిఎస్ ఎంప్లాయీస్ బకాయిలు రూ.2500 కోట్లు, ఎపిజిఎల్‌ఐ రూ.950 కోట్లను చెల్లించాల్సి ఉందని వివరించారు. ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లిం చాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయా లని, ఐఆర్ 30 శాతం ప్రకటించాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో రవి, టి.వెంకటేశ్వర్లు, ఆర్.అజరు కుమార్, డి.లింగయ్య, పి.ప్రేమ్‌కుమార్, పి.సత్యానం దరావు, కె.వెంకటేశ్వరరావు ఉన్నారు.
