కోడూరు తీరంలో పర్యాటకుల సందడి

Jun 9,2024 21:26
కోడూరు తీరంలో పర్యాటకుల సందడి

పర్యాటకులను అప్రమత్తం చేస్తున్న పోలీసులు
కోడూరు తీరంలో పర్యాటకుల సందడి
ప్రజాశక్తి -తోటపల్లిగూడూరు :మండలంలోని కోడూరు సముద్ర తీరం లో ఆదివారం సందడి వాతావరణం ఏర్పడింది. మండుతున్న ఎండల ప్రభావం నుంచి ఉపశమనం పొందేందు కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్య లో ప్రజలు కోడూరు తీరానికి తరలి వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజల రాకపోకలు సాగాయి. కుటుం బాల సమేతంగా కదలి వచ్చి తీరం వెంబడి సందడి చేశారు. యువత ఆటపాటలతో సందడి చేసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన లు సంభవిం చకుండా తీరం వెంబడి ఎస్‌ఐ జంపాని కుమార్‌ ఆధ్వర్యం లో పోలీసు బందోబస్తును ఏర్పాటైంది.సముద్రంలో లోతుకు వెళ్లకుండా విజిల్స్‌ వేస్తూ ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు. అధిక సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలతో కోడూరు సముద్ర తీరంలో పండుగ వాతావరణం నెలకొంది.

➡️