కిక్కిరిసిన మార్కెట్‌

Oct 11,2024 19:29

ప్రజాశక్తి-విజయనగరంకోట  :  దసరా నేపథ్యంలో నగరంలోని ప్రధాన మార్కెట్‌ ప్రాంతాలు కిటకిటలాడాయి. జిల్లాలోనే అతిపెద్దదైన పిడబ్ల్యుమార్కెట్‌, మున్సిపల్‌ కార్యాలయం వద్ద మార్కెట్‌, గంటస్తంభం, కన్యకాపరమేశ్వరి ఆలయం, ఎమ్‌జి రోడ్డు తదితర ప్రాంతాలు వేలాది మందితో కిక్కిరిసిపోయాయి. జిల్లా కేంద్ర ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు నిత్యాసర సరుకులు, పండ్లు, పూలు తదితర సామాగ్రి కోసం రావడంతో మార్కెట్‌ అంతా జనసంద్రంగా మారింది.

➡️