ప్రజాశక్తి-సోమల (చిత్తూరు) : వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలో వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. బురుజుపల్లి చింతలవారిపల్లి కమ్మపల్లి ఆవులపల్లి మిట్టపల్లి నెల్లిమంద వెంకటేశ్వర స్వామి పాదాలు తదితర ఆలయాలలో ఉదయం నుండే భక్తులకు దర్శనం కల్పించారు. ఉత్తర ద్వార దర్శనం కోసం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి మూల విగ్రహాలను ఏర్పాటు చేసి భక్తులను అనుమతించి దర్శన భాగ్యాన్ని కల్పించారు. ప్రతి ఆలయంలో భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం చేశారు.