ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : మహాత్మా గాంధీ 155వ జయంతిని సందర్భంగా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో బుధవారం ఎస్‌ఐ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించారు ఎస్సై మాట్లాడుతూ దేశమని, అలాంటి గొప్ప దేశచరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోయే వ్యక్తి మహాత్మా గాంధీఆని, దేశ ప్రజలు అనుభవిస్తున్న ఈ స్వేచ్చ జీవితాలు ఏంతో మంది యోధుల త్యాగ ఫలమని, వారిలో గాంధీ అగ్ర స్థానంలో ఉంటారని చెప్పారు. గాంధీ జయంతిని పురష్కరించుకుని వారికి నివాళిగా దేశ వ్యాప్తంగా ”స్వచ్చ భారత్ దివస్” గా కూడా జరుపుకోవడం చాలా సంతోషకరమని, గాంధీజీ ఆశయాలను ఉద్యోగులు అందరూ కొనసాగించాలి ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ దస్తగిరి చందర్ బాబు నాయక్ శ్రీనివాసులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
