నాగు పాముకు వైద్యం

ప్రజాశక్తి-కడప అర్బన్‌ : నాగు పాముకు ప్రాంతీయ పశువైద్యశాల డిడి రంగస్వామి వైద్యం చేశారు. శని వారం స్థానిక ఆసుపత్రికి నాగు పాముకు దెబ్బ తగిలిందని స్నేక్‌ క్యాచర్‌ ఆసుపత్రికి తీసుకు వచ్చారు. అది గమనించిన జూనియర్‌ వెటర్నరీ ఆఫీసర్‌ నంద్యాల రాజశేఖర్‌ సంబం ధిత ఎడి డాక్టర్‌ ఒ.ఎల్‌.నేతాజీ, డిడి డాక్టర్‌ కె.రంగస్వామి పాముకు పదునైన ఇనుప వస్తువు తగులుకుని పేగులు బయటికి వచ్చినట్లు నిర్దారణ చేశారు. ప్రేగులు లోపలికి తోసి కుట్లు వేసి పూర్తిస్థాయి చికిత్స అందించారు. ఎడి డాక్టర్‌ సుబ్బరాయుడు, విఎఎస్‌ డాక్టర్‌ చాంద్‌బాషా, విఎల్‌ఒ శివలక్ష్మి, ఎల్‌ఎస్‌ఎ షాహిదా బేగం, సిబ్బంది రమేష్‌ సిబ్బంది పాముకు వైద్యం చేయడం లో సహాయం చేశారు. ఇంటర్న్‌షిప్‌ విద్యార్థులు, పశువుల యజ మానులు, పాముకు వైద్యం అందించడంతో అక్కడ ఉన్న పశువుల, కుక్కల, పిల్లల పెంపకదారులు ఆనందం వ్యక్తం చేశారు.

➡️