గడిచిన 5 ఏళ్ళు ఎపి లో విధ్వంస పాలన సాగింది : దగ్గుబాటి పురంధరేశ్వరి

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : గడిచిన 5 ఏళ్ళలో ఎపి లో విధ్వంస పాలన సాగిందని బిజెపి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. ఆదివారం దగ్గుబాటి పురంధరేశ్వరి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ దక్షిణ నియోజకవర్గ మాజీ సమన్వయకర్త వాసుపల్లీ సంతోష్‌ కుమార్‌ బిజెపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా బిజెపి పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పురంధరేశ్వరి మాట్లాడుతూ … ఢిల్లీ లో 27 సంవత్సరాలు తరువాత బీజేపీ జెండా ఎగిరిందని, ఈ విజయాన్ని బీజేపీ కార్యకర్తలకు అంకితం చేస్తున్నామని పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయడంతో బీజేపీ ఘన విజయం సాధించిందని అన్నారు. ఏపీ లో గడిచిన ఐదు సంవత్సరాలలో విధ్వంసానికి, కక్షలతోనే వైఎస్‌ఆర్సిపి ప్రభుత్వం కేవలం తమ జేబులు నింపుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగించిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలు కూటమి కి అనూహ్య విజయం అందిచారని అన్నారు. ఢిల్లీ లో మద్యం స్కాం మాదిరిగా రాష్ట్రం లో కూడా స్కాం జరిగిందని ఆరోపించారు. అందరికి సమాన అవకాశాలు ఇవ్వాలనే రాజ్యాంగ స్ఫూర్తి తో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బిడ్జెట్‌ ను పెట్టడం జరిగిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ని దేశ ప్రజలు అంగీకరించడం లేదని డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఉంటే అభివఅద్ధి ఏవిధంగా ఉంటుందో చెప్పడానికి ఆంధ్రప్రదేశ్‌ ఉదాహరణ అని అన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను లాభాలతో నడిపించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం సహాయం చేస్తుందన్నారు. గడిచిన ఐదేళ్లలో అమరావతి రాజధానిని నిర్వీర్యం చేశారని, 2014 నుండి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అమరావతి నిర్మాణానికి ఇప్పడు రూ.15,000 కోట్లు ఆర్థిక సాయం కూడా చేశామని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా బ్రిటిష్‌ కాలం లో పెట్టిన వాల్తేర్‌ డివిజన్‌ ను విశాఖపట్నం డివిజన్‌ గా మార్చామని, వైఎస్‌ఆర్సీపీ హయాంలో రోడ్లు దయనీయ స్థితిలో ఉండేవని వాటిని రూ.4800 కోట్లు పంచాయితీ రాజ్‌ నిధులతో మరమ్మతులు చేస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ అభివఅద్ది కి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేకే లైన్‌ , అరకు రైల్వే స్టేషన్‌ సమస్య ని ఇప్పటికే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ దఅష్టి తీసుకువెళ్ళడం జరిగిందని, వారు పరిశీలిస్తామని మంత్రి చెప్పారని, అరకు రైల్వేస్టేషన్‌ ను వదులుకొనే పరిస్థితి లేదని, విశాఖ డివిజన్‌ లో కొనసాగించే విధంగా ప్రయత్నం చేస్తామని తెలిపారు. అనంతరం వాసుపల్లి సంతోష్‌ మాట్లాడుతూ … కేంద్రం లో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు నచ్చడంతోనే బిజెపి పార్టీ లో చేరుతున్నానని తెలిపారు. ఒక ఆటో డ్రైవర్‌ కొడుకుగా పుట్టి తన పిల్లల ను అమెరికా లో చదివించే స్థాయికి వచ్చేందుకు ఏవిధంగా కఅషి చేశానో , బిజెపి పార్టీ ను బలోపేతం చేసేందుకు అదేవిధంగా కఅషి చేస్తానని అన్నారు. తాను బిజెపిలోకి రావటానికి సహకరించిన బిజెపి నాయకులు సెయిల్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ కాశి విశ్వనాధ రాజు , బిజెపి జిల్లా అధ్యక్షులు ఎంఎంఎన్‌ పరశురామ రాజులకు కఅతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏంఎల్‌ఏ విష్ణు కుమార్‌ రాజు మాట్లాడుతూ … మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మానసిక వ్యాధితో బాధపడుతున్నారని, అందుకే పార్టీ నుండి ప్రధాన నాయకులంతా ఒక్కొక్కరుగా బయటికి వెళ్లిపోతున్నారని ఎద్దేవా చేశారు. మళ్ళీ 2.0 పేరుతో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి వస్తామని మాట్లాడుతున్నారని అన్నారు. అదేవిధంగా రుషికొండలో నిర్మించిన భవనాలపై వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, ఆ భవనంలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్ర ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని తన వ్యక్తిగత అభిప్రాయంగా తెలిపారు.

➡️