కత్తిపూడి మాధురి లో ఘనంగా దసరా సంబరాలు.. ఆకట్టుకున్న రావణబ్రహ్మ దహన కాండ

Oct 1,2024 15:50

ప్రజాశక్తి – శంఖవరం (కాకినాడ) : రాబోయే దసరా ఉత్సవాలు పురస్కరించుకుని కత్తిపూడి గ్రామంలో ఉన్న మాధురి విద్యాలయం యాజమాన్యం విద్యార్థులతో దసరా సంబరాలు ఘనంగా నిర్వహించారు మంగళవారం స్కూల్ చైర్మన్ కడారి తమ్మయ్య బాబు వారి సతీమణి సీతాదేవి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులు నవ దేవత రూపాల తో నృత్య ప్రదర్శన వంటి సాంస్కృతిక కార్యక్రమం వీక్షకులను అలరించింది అనంతరం చైర్మన్ కడారి తమ్మయ్య బాబు చేతుల మీదుగా రావణబ్రహ్మ దహన కాండ కార్యక్రమం చైర్మన్ చేతుల మీదుగా జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ విద్యార్థులు చదువుతోపాటు ఆటపాటల్లో కూడా రాణించడం గర్వకారణంగా ఉందని అందుకని తమ స్కూల్ విద్యార్థులు దుర్గ మాత ఆశీస్సులు పొందాలని ఈ సందర్భంగా చైర్మన్ కోరారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.

➡️