దళిత పేటలో కంపు

Apr 16,2025 14:48 #The stench in the Dalit camp

దేవరాపల్లి (అనకాపల్లి) : దేవరాపల్లి, దళిత పేటలో కంపు కోడుతుందని, పేదలు దళితులు ఆనారోగ్యం పాలవుతున్నారని ఆంధ్రప్రదేశ్‌ వ్వవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి డి.వెంకన్న పేర్కొన్నారు. బుధవారం దేవరాపల్లి దళిత పేటలో గుల్లిపల్లి వారి చెరువును పరీశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ చెరువుకు ఒకప్పుడు ఆయకట్టుభూమి ఉండేదని, ఇప్పుడు చెరువు చుట్టు ఇల్లులు, నిర్మాణం జరగడంతో చెరువు నిరుపయోగంగా ఉందని తెలిపారు పెదరాయి సెంటర్‌ నుండి గోళ్ళ పెట దళిత పేటలో మొత్తం వృధా నీరు చెరువులోకి చేరుతుందని తెలిపారు. క్రిందికి నీరు పోయే దారి పని చేయక పోవడంతో క్రిందికి నీళ్ళు వెళ్ళడం లేదన్నారు. దీని వలన నీరు నిలువ ఉండి పోవడం చనిపోయిన కుక్కలు పందులు పిల్లులు ఎలుకల చెత్తాచెదారం నిల్వ ఉండి పోయి చెరువు కంపు కొడుతుందని తెలిపారు. దగ్గరలో పాఠశాల చెరువు చుట్టు నివాసం ఉంటున్న దళితులు పేదలు ఆనారోగ్యం పాలు అవుతున్నారని తెలిపారు. దోమలు బెడద ఎక్కువ అవ్వడంతో మలేరియా డెంగ్యూ వ్యాధులు వస్తున్నాయని తెలిపారు. కేవలం దళితులపై వివక్షతోనే ఇలాంటి ఘాతుకానికి అధికారులు పూనుకుంటున్నారని తెలిపారు. వర్ష కాలం వస్తే చెరువు నిండిపోయి దళితపేటలో కోన్ని ఇల్లలోకి నీళ్ళు వచ్చేస్తుందని తెలిపారు. రెండు రోజులు క్రితం అంబేద్కర్‌ జయంతి సందర్భంగా గోప్పగోప్ప వ్యక్తులు చేతులు మీదుగా అంబేద్కర్‌ కు పూలమాలలు వేసారని ఇది మంచి పరిణామమని మరి దళితులు నివాసం ఉంటున్న ప్రాంతాన్ని దళితులు సమస్యలు పరిష్కరించాలని తెలియక పోవడం దళితుల పట్ల వివక్ష చూపడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆధికారులు స్పందించి శాశ్వతంగా చెరువు నీళ్లు పోవడానికి మార్గం ఏర్పాటు చేయాలని లేదంటె చెరువును పూర్తిగా మూసి దళితులు ఆనారోగ్యం పాలు అవ్వకుండ చర్యలు చేపట్టాలని వెంకన్న డిమాండ్‌ చేశారు.

➡️