రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దళిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి : దళిత, గిరిజన ప్రజా సంఘాల డిమాండ్

Nov 26,2024 18:15 #antapuram, #putulu

ప్రజాశక్తి – పుట్లూరు : మండలం ఎల్లుట్ల గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దళిత కుటుంబాల సభ్యులను దళిత గిరిజన ప్రజా సంఘాల నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత ఆదివారం గార్లదిన్నె మండలం తలగాసిపల్లి గ్రామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మృతి చెందగా.. ఐదుగురికి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారని వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతి చెందిన ప్రతి కుటుంబంలోని ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం ఇవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదానికి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి.  ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం.. ఊళ్లో పనులు లేవు. పనుల కోసం సుదూర ప్రాంతాలకు  ళ్తున్నారు. మృతి చెందిన కుటుంబాలు రెక్కల కష్టం తప్ప మరో దారిలేదు. కూలి పనులు చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటున్నారు. పి జి, బి టెక్,డిగ్రీ, ఇంటర్ చదువుకున్నారు. చనిపోయిన కుటుంబ సభ్యులకు పిల్లలకు ఎలాంటి ఉపాధి లేదు. తల్లిదండ్రులు ఇద్దరూ మృతి చెందడంతో తమకు దిక్కెవరు అని వారి పిల్లలు ధీనంగా వేడుకున్నారు.  ప్రభుత్వం మృతి చెందిన కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా ప్రభుత్వ ఉద్యోగం, 5 ఏకరాల భూమి, పాడి పరిశ్రమకు రుణ సదుపాయం తోపాటు అన్ని రకాల బాధితులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో
జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బి సి ఆర్ దాస్, నెరమెట్ల ఎల్లన్న, సాకే చిరంజీవి, జె.రామన్న, కె వి పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓ.నల్లప్ప, బండారు కుల్లాయప్ప ఎస్సీ, ఎస్టీ పరిరక్షణ సమితి, ఎస్ కె యు అడ్వకేట్ తిరుపాలు, మీనుగ రామాంజినేయులు, రంగాపురం పుల్లప్ప, శ్యామలమ్మ, ఛామలూరు రాజగోపాల్, కొర్రపాడు రమణ, రాళ్ళపల్లి చంద్రశేఖర్లు పాల్గొన్నారు.

➡️