అనుమానాస్పద స్థితిలో దళితుని యువకుడు మృతి

May 15,2024 00:53

ప్రజాశక్తి – తుళ్లూరు : అనుమానాస్పద స్థితిలో దళిత వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని వడ్డమానులో మంగళవారం వెలుగు చూసింది. మృతుని తల్లి మరిమ్మ ఫిర్యాదు మేరకు.. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలనికి చెంది. మురికిపూడి బుల్లిబాబు (33) వడ్డమానుకు చెందిన చుండు నరసింహారెడ్డి (నర్సిరెడ్డి) దగ్గర పదేళ్లుగా బ్రిక్స్‌ పనిచేస్తున్నాడు. కొంతకాలంగా బ్రిక్స్‌ పని మానేసి నర్సీరెడ్డికి చెందిన గేదెలను కాస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం బుల్లిబాబు బంధువైన మురికిపూడి నాగేశ్వరరావుకు నర్సిరెఇ్డ ఫోన్‌ చేసి బుల్లిబాబు మూడ్రోసుల నుండి అన్నం తినకుండా ఎన్నికల మద్యం తాగుతున్నాడని, సోమవారం కూడా మద్యం తాగి చెట్టు కింద పడిపోయాడని చెప్పాడు. ఈ సమాచారం తెలుసుకున్న బుల్లిబాబు తల్లిదండ్రులు మరియమ్మ, గోపాల్‌, మరికొందరు బంధువులు వెళ్లి చూడగా బుల్లిబాబు చనిపోయి ఉన్నాడు. దీంతో మరియమ్మ తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడు బుల్లిబాబు ఒంటిపై రక్తపు గాయలున్నాయని, సహజ మరణం కాదని ఫిర్యాదులో పేర్కొన్నారు. నర్సిరెడ్డి, అతని కుమారుడు, కుటుంబ సభ్యులతో పాటు బుర్రా వెంకటరెడ్డి, నరేంద్రరెడ్డి తన కొడుకు మృతికి కారణమని ఫిర్యాదులో ఆరోపించారు. తన కొడుకు ఎప్పుడు జీతం అడిగినా నర్సిరెడ్డి కులం పేరుతో తిట్టేవాడనే విషయం తన కుమారుడు తరచూ తనకు చెబుతండేవాడని, దీనిపై విచారణ చేయాలని కోరారు.

➡️