డాక్టరేట్ పొందిన జిల్లా వైఎస్ఆర్సిపి ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్

Jan 5,2025 15:50 #nandhyala, #ysrcp

ప్రజాశక్తి, – నంద్యాల కలెక్టరేట్ : వైఎస్ఆర్ సిపి నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ కి ది అమెరికా యూనివర్సిటీ గ్లోబల్ పీస్ సంస్థ వారిచే సోషల్ సర్వీస్ విభాగంలో గౌరవ డాక్టరేట్ ప్రధానం చేశారు. డాక్టర్ అమీర్ బాష అనేక సంవత్సరాల నుండి సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ తనదైన గుర్తింపును పొందారు. అందులో భాగంగా మెడికల్ క్యాంపులు, స్వచ్ఛంద సంస్థల లో ఉన్న చిన్నారులకు, అనాధలకు, వృద్ధులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ, అదేవిధంగా సమాజంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను, మహిళలను ఆర్థికంగా సామాజికంగా చేయూత నందిస్తూ సేవా కార్యక్రమాలలో ముందుండేవారు. వీరి విశిష్ట సేవలను గుర్తించిన ది అమెరికన్ యూనివర్సిటీ గ్లోబల్ పీస్ సంస్థ దాల్మిల్ అమీర్ ని గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి సోషల్ సర్వీస్ గౌరవ డాక్టరేట్ ను అందించారు.

➡️