పలువురికి దామచర్ల సత్య నివాళి

ప్రజాశక్తి-కొండపి: కొండేపి మండలం వెన్నూరు గ్రామంలోని పోకూరి లక్ష్మీనరసింహ దశదిన కార్యక్రమంలో రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య పాల్గొని నివాళులర్పించారు. అదే విధంగా కొండపి మండల కేంద్రంలోని టిడిపి నాయకులు నన్నూరి సుబ్బరామయ్య మాతృమూర్తి కీ. శే. నన్నూరి రమణమ్మ దశదిన కార్యక్రమంలో పాల్గొని సత్య నివాళులర్పించారు. ఈయన వెంట మాజీ ఏఎంసీ చైర్మన్‌ జి.రామయ్యచౌదరి, నారాయణస్వామి, మండల పార్టీ అద్యక్షుడు బి.యలమందనాయుడు, వసంతరావు, గుండపనేని రామూర్తినాయుడు, రమేష్‌, మండల యూత్‌ అధ్యక్షుడు కాలేషా, మండలంలోని టిడిపి నాయకులు ఉన్నారు.

➡️