ప్రజాశక్తి-నందిగామ (ఎన్‌టిఆర్) : మధ్యాహ్న భోజన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ … 2 వ రోజు నందిగామ ఆర్డీవో కార్యాలయం ఎదురుగా కార్మికులు మంగళవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ మధ్యాహ్న భోజనం వర్కర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సి హెచ్ సుప్రజ మాట్లాడుతూ … రాష్ట్ర ప్రభుత్వం విద్యా కమిటీలని ఎందుకు పెట్టింది ? ప్రభుత్వం అంటే ఆ స్కూలు డెవలప్మెంట్ కోసం పెట్టారు …కానీ ఈరోజు ఆ విద్యా కమిటీలు కానీయండి ఎస్‌ఎంఎస్ కమిటీ లు కానీయండి స్కూల్ డెవలప్మెంట్ కోసం కాకుండా వాళ్ళు వచ్చిన దగ్గర్నుంచి మధ్యాహ్న భోజన పథకం కార్మికులనే తీసివేయటానికి వాళ్ళు తీర్మానాలు చేయడానికి మాత్రమే కమిటీలు పెట్టారని విమర్శించారు. ఈ కమిటీల ద్వారా మధ్యాహ్న మెనూ ఏ విధంగా అమలు చేద్దాం అనే ఆలోచనలను ప్రభుత్వం పక్కదారిన పట్టేట్లు చేసిందని మండిపడ్డారు. అసలు అలాంటి ఆలోచన లేకుండా కేవలం ఈ ఏజెన్సీ ఏ పార్టీ టీడీపీ పార్టీనా ? వైసిపి పార్టీనా అని మాత్రమే చూస్తున్నారు అని ధ్వజమెత్తారు. ఆ విధంగా మధ్యాహ్న భోజన పథకం కార్మికులను తొలగిస్తున్నారని అన్నారు. దీనిని మధ్యాహ్నం భోజనం వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. కాబట్టి తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులను విధుల్లోకి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కె.గోపాల్ . వేల్పుల ఏసొబు, కళావతి, సత్యవతి, జాన్ బి, ప్రసాద్, కార్మికుల పాల్గొన్నారు.