తిరుపతి సిటీ : గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం తిరుపతి రుయా ఆసుపత్రిలో జరిగింది. సింహాచలం కుమారుడు ఎం.తేజేశ్వర వర్మ, (50) విజయనగరంగా.. ఆసుపత్రిలో ఓపీలోని చీటీలో నమోదయి ఉంది. అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మధ్యాహ్నం తేజేశ్వర వర్మ ఆసుపత్రిలో చేరాడు. సాయంత్రం మృతి చెందాడు. మఅతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఎవరైనా మఅతదేహాన్ని గుర్తిస్తే తిరుపతి వెస్ట్ పోలీసులను సంప్రదించాలని వెల్లడించారు.
