ప్రజాశక్తి-కాశినాయన మండల పరిధిలోని కాశినాయన జ్యోతి క్షేత్ర ఆలయ నిర్మా ణం పనుల అనుమతిపై ఢిల్లీ పెద్దలు సా నుకూలంగా ఉన్నా రని బద్వేల్ నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి రితీష్‌కుమార్‌రెడ్డి పేర్కొ న్నారు. శుక్రవారం ఆయన జ్యోతిక్షేత్రాన్ని సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కాశీనాయన జ్యోతి క్షేత్రం మొదటి నుండి తెలు గుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే అభివద్ధి చెందిందని పేర్కొన్నారు. తన తాత మంత్రి వీరారెడ్డిగా ఉన్నప్పుడు ఇక్కడ అన్ని అభివద్ధి కార్యక్రమాలు జరిగా యని గుర్తుచేశారు. అనుమతులకు సంబంధించిన పైళ్లను, ఆధారాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ ఢిల్లీలోని పెద్దలతో మాట్లాడి అటవీశాఖ అనుమతులు తీసుకొస్తారని ధీమా వ్యక్తం చేశారు. స్థానికులు, భక్తులు ఎలాంటి అపోహలు పెట్టుకో వద్దన్నారు. అనంతరం అక్కడ తలనీలాలు తీసుకునే రూములకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఖాది, గ్రామీణ ప్రదేశాల శాఖ చైర్మన్ కె.కె. చౌదరి, టిడిపి నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు రవీంద్రారెడ్డి, నాయ కులు రాజారెడ్డి, గురివిరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, రవీంద్రారెడ్డి పాల్గొన్నారు.
