– ఆర్ అండ్ ఆర్ అధికారికి సిపిఎం ప్రజాప్రతినిధుల వినతి
ప్రజాశక్తి-కూనవరం
ఏటా మునుగుతూ ఇబ్బంది పడుతున్న ముంపు గ్రామాలలో కొన్నింటిని గుర్తించడం జరిగిందని, ఆ ప్రాధాన్యత గ్రామాలకు వెంటనే ప్యాకేజీ ఇప్పించాలని సిపిఎం ప్రజాప్రతినిధులు, నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు చింతూరు ఐటిడిఎ కార్యాలయంలో ఆర్ అండ్ ఆర్ అధికారిని సిపిఎం ప్రజాప్రతినిధులు, నాయకులు మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా ప్యాకేజీ పెంచి ఇచ్చి నిర్వసితులకు న్యాయం చేయాలన్నారు. ప్రతి నిర్వసితుడికీ రూ.10 లక్షలు నష్ట పరిహారం అందించాలని కోరారు.స్థానిక సమస్యలపై వినతి అనంతరం ఐటిడిఎ ఏపిఓని కలిసి స్థానిక సమస్యలు, రోడ్లు, సమస్యలపై సిపిఎం ప్రజాప్రతినిధులు, నాయకులు వినతి పత్రం అందజేశారు. పాఠశాల భవనాల మరమ్మతుల గురించి వివరించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించి సమస్యలు పరిస్కారమయ్యేల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొమరం పెంటయ్య, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మేకల నాగేశ్వరావు, పాయం సీతారామయ్య, సర్పంచ్‌లు నాగమణి, వెంకమ్మ, శంకర్, ఎంపీటీసీలు అమ్మాజీ, జయసుధ, తమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.