ప్రభుత్వాస్పత్రిలో ప్రసవాలు చేయాలి 

Jun 11,2024 21:23

ప్రజాశక్తి- డెంకాడ : ప్రభుత్వాస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా పనిచేయాలని డిఎంఅండ్‌హెచ్‌ఒ ఎస్‌.భాస్కరరావు సూచించారు. స్ధానిక పిహెచ్‌సిని ఆయన మంగళవారం ఆశ డే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఆశాలు ఆస్పత్రిల్లో ప్రసవాలు సంఖ్య పెంచి మరింత ఉన్నతికి కృషి చేయాలన్నారు. శతశాతం వ్యాధి నిరోధిక టీకాలు అందించాలని సూచించారు. డయేరియా ప్రబలకుండా వచ్చే వర్షాకాలనికి అనుగుణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హెచ్‌బిఎన్‌సి, హెచ్‌బివైసి కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. ఆశా కార్యకర్తలు ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఆశా యాప్‌లో లాగిన్‌ అవ్వాలన్నారు. విధులను సక్రమంగా నిర్వర్తించి ప్రభుత్వ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్తే చక్కటి ఫలితాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ఎం. శివరామకృష్ణ, సిహెచ్‌ఒ ఏసయ్య, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండికొత్తవలస: సీజనల్‌ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని వియ్యంపేట పిహెచ్‌సి డాక్టర్‌ గోపాలకృష్ణ అన్నారు. వియ్యం పేట పిహెచ్‌ లో సిబ్బంది, ఆశ వర్కర్స్‌ పని తీరు పై నెల వారీ సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. రానున్న వర్షా కాలంలో అంటువ్యాధులు ప్రభల కుండా సిబ్బంది క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రతి నెలలోనూ డెలివెరీలు సంఖ్య పెంచాలని తెలిపారు. టీబీ మందులు రోగులకు క్రమం తప్పకుండా వేసుకునేటట్లు చూడాలన్నారు. వయోజనుల బీసీజీ టీకాలు 100శాతం వేసేటట్లు చూడాలని, కుష్టు రోగులు అనుమానిత కేసులు సర్వే నిర్వహింంచాలని తెలిపారు. గర్బిణుల రిజిస్ట్రేషన్‌ జరిగేటట్లు చూడాలని, హైరిస్క్‌ గర్భిణుల పట్ల జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. మాతా, శిశు మరణాలు జరగ కుండా చూడాలన్నారు. ఆశ యాప్‌, 102 తల్లీ బిడ్డా ఎక్స్‌ప్రెస్‌ సేవలు, కిల్కరి సేవలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇఒ నరసింహారావు, పిహెచ్‌ ఎన్‌. జగదాంబ, హెచ్‌వి పద్మావతి, హెచ్‌ఎస్‌ ఈశ్వరావు, టెక్నీషియన్‌ సంతోష్‌, హెల్త్‌ అసిస్టెంట్స్‌ సత్యారావు, ఈశ్వరావు, ఏఎన్‌ఎమ్స్‌, ఆశ వర్కర్స్‌, పాల్గొన్నారు.

➡️